Header Banner

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! 30 వేల మంది పైలట్లు అవసరం..

  Tue Mar 11, 2025 16:07        Politics

భారత్లో పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రయాణికుల సంఖ్య ఏటికేడు పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా విమానాలను సైతం ఆయా సంస్థలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో పైలట్లు కూడా పెద్ద సంఖ్యలో అవసరమవుతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాబోయే 15-20 ఏళ్లలో సుమారు 30వేల మంది పైలట్లు అవసరం పడతారని పేర్కొన్నారు. 200 శిక్షణ విమానాల కొనుగోలుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. దేశీయంగా 800కు పైగా విమానాలు సేవలందిస్తున్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం 6,7 వేల మంది పైలట్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వివిధ కంపెనీలు 1700కు పైగా విమానాలకు ఆర్డర్ పెట్టాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అవి సేవలందించబోతున్నాయన్నారు. దీంతో రాబోయే 15-20 ఏళ్లలో 30 వేల మంది పైలట్లు అవసరమని చెప్పారు. భారత్ను ట్రైనింగ్ హబ్డి కూడా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. విమానయాన పరిశ్రమ కోసం మంత్రిత్వ శాఖ ఒక సమష్టి విధానంతో పనిచేస్తోందని చెప్పారు. 38 ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ను తనిఖీ చేసి అధికారులు రేటింగ్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..

 

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations